బుల్లితెరపై హాట్ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న అనసూయ... వెండితెరపై కూడా రాణిస్తుంది. క్షణం సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని, రంగస్థలం సినిమాతో 'రంగమ్మత్త' గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తాజాగా అనసూయ టాలీవుడ్ దర్శకుడితో రొమాన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమై టాలీవుడ్ లో సెన్సషనల్ యూత్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ని, ఇప్పుడు హీరోగా పరిచయం చేసే బాధ్యతను విజయ్ తీసుకున్నాడు. దీనికోసం 'కింగ్ అఫ్ హిల్' అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించాడు విజయ్.
ప్రొడ్యూసర్ గా తన మొదటి సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన కథానాయికగా అనసూయ ని తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. అయితే.. తాజాగా ఈ విషయంపై స్పందించిన అనసూయ, 'విజయ్ దేవరకొండ- తరుణ్ సినిమాలో నేను ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం నిజమే కానీ.. తరుణ్ ప్రియురాలిని మాత్రం నేను కాదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలాఉండగా, అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'కథనం' సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.