సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీల పైన అయితే ఆ ట్రోల్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉండటం మనం చూస్తుంటాము.
ఇక తాజాగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఒక పిల్లవాడు సేల్ఫీ కోసం ఆమెని అడగగా విసురుగా ఆ ఫోన్ ని కింద కొట్టింది అన్న దాని పైన అమెపైన ఒక పోలీసు కేసు నమోదు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆమెకి సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అలాగే తాను ఈ సంఘటనలో తనవైపు నుండి ఎటువంటి పొరపాటు లేదు అని ఆమె వివరణ ఇచ్చింది.
కాకపోతే అనసూయ మాటని ఎవ్వరు పట్టించుకోకుండా తనని టార్గెట్ చేయడం పట్ల ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఇక దానితోనే ఆమె కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టిస్తుంది.
మొత్తానికి ఈ నిర్ణయంతో అందరికి పెద్ద షాక్ ఇచ్చింది అని అనాల్సిందే.. చూద్దాం.. అనసూయ మళ్ళీ ఎప్పుడు సోషల్ మీడియా బాట పట్టనుందో!