'రంగమ్మత్త'పై సుకుమార్‌ అంత రీసెర్చ్‌ చేశాడా?

మరిన్ని వార్తలు

సుకుమార్‌ వెండితెర అద్భుతం 'రంగస్థలం'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్స్‌ జోరు కూడా ప్రదర్శిస్తోందీ సినిమా. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర అద్భుతమే. హీరోగా రామ్‌చరణ్‌, హీరోయిన్‌గా సమంత పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇక అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్ర కోసం కూడా సుకుమార్‌ ఎంతో రీసెర్చ్‌ చేశాడట. ఈ పాత్ర కోసం తమిళ, తెలుగు భాషల్లో దాదాపు పదిమంది ఆర్టిస్టులను పరిశీలించాడట సుకుమార్‌. వారిపై టెస్ట్‌ షూట్స్‌ కూడా చేయించాడట. అయితే ఎవ్వరూ నచ్చలేదట. ఆ పాత్రకి స్టన్నింగ్‌ అండ్‌ స్పెషల్‌ యాక్టింగ్‌ కనబరిచే ఆర్టిస్టు కావాలనుకున్నాడట. అలా ఆ పాత్రకి అనసూయ దొరికిందట. చెప్పినట్లుగానే ఈ పాత్రకి అనసూయ అందంతో పాటు న్యాయం కూడా చేసిందనీ, రంగమ్మత్త పాత్రకు ఒప్పుకున్నందుకు అనసూయకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు సుకుమార్‌. 

ఆ పాత్ర పోషించేందుకు అనసూయ చాలానే నస పెట్టిందట. ఆ విషయం అనసూయే స్వయంగా చెప్పింది. ఏది ఏమైనా హాట్‌ హాట్‌ అనసూయ 'రంగమ్మత్త'గా ఓ ట్రెండ్‌ సృష్టించేసింది. తన కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ, ఇకపైనా కూడా పోషించలేని ఓ గొప్ప పాత్రను పోషించి శభాష్‌ అనిపించుకుంది. చరణ్‌ తన ఫేవరేట్‌ హీరో అనీ, ఆయన సినిమాలో ఇలాంటి పాత్ర పోషించే అవకాశం తనకిచ్చినందుకు చరణ్‌తో పాటు, సుకుమార్‌కీ అనసూయ థాంక్స్‌ చెప్పింది. సినిమాని ఇంతగా ఆదరించినందుకు అభిమానులకూ మన రంగమ్మత్త స్పెషల్‌ థాంక్స్‌ చెప్పింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS