రంగ‌మ్మ‌త్త‌కు మ‌రో సూప‌ర్ ఆఫ‌ర్‌?

By Gowthami - February 22, 2020 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

అటు బుల్లి తెర‌, ఇటు వెండి తెర‌... రెండు చోట్లా విజృంభించేస్తోంది అన‌సూయ‌. రంగ‌స్థ‌లం త‌ర‌వాత‌.... ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచింది. సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది అన‌సూయ‌. పింక్ రీమేక్‌లోనూ... అన‌సూయ న‌టిస్తోంద‌ని స‌మాచారం. ఈలోగా మ‌రో మంచి ఆఫ‌ర్ అందుకుంది. నితిన్ ఇప్పుడు `అంధాధూన్‌` రీమేక్‌పై దృష్టి పెట్టాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ఇందులో ఓ కీల‌కమైన పాత్ర కోసం అన‌సూయ‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

 

`అంధాధూన్‌` మాతృక‌లో ఈ పాత్ర‌ని ట‌బు పోషించింది. ఆ స్థాయి ఉన్న న‌టి తెలుగులో ఎవ‌రూ క‌నిపించ‌లేదు.కొంత‌మంది సీనియ‌ర్ క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌కు వ‌చ్చినా, చివ‌రికి అన‌సూయ‌కే ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. అన‌సూయ సినిమాలో ఉంటే బీ, సీ ఆడియ‌న్స్ లో కాస్త క్రేజ్ ఉంటుంది. అందుకే అన‌సూయ‌ని తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS