బిగ్ బాస్ అంటే అంత చిరాకు ఎందుకో..?

By Gowthami - May 17, 2020 - 14:39 PM IST

మరిన్ని వార్తలు

రియాలిటీ షోల‌లో బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజు వేరు. అన్ని భాష‌ల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్టే. తెలుగులోనూ బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఈ షోలో పాల్గొనే అవ‌కాశం కోసం సెల‌బ్రెటీలంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. కొంత‌మందైతే.. `అస‌లు బిగ్ బాస్ కూడా ఓ షోనేనా..` అంటూ వేళాకోళంగా మాట్లాడ‌తారు. ప్ర‌ముఖ యాంక‌ర్ ఝాన్సీ రెండో ర‌కం.

 

బిగ్ బాస్ పై ఝాన్సీకి మంచి అభిప్రాయం ఏమాత్రం లేదు. ``ఆ షోకి వెళ్ల‌డం.. తెలిసి తెలిసి రాయితో ప‌ళ్లు రాల‌గొట్టుకోవ‌డం రెండూ ఒక్క‌టే`` అంటోంది. బిగ్ బాస్ 1లో త‌న‌కు ఆఫర్ వ‌చ్చింద‌ని, అయితే నాలుగ్గోడ‌ల మ‌ధ్య తాను బంధీ అవ్వ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, ఆ షో త‌న వ్య‌క్తిత్వానికీ, అభిరుచికి ప‌డ‌ద‌ని తేల్చేసింది. బిగ్ బాస్ రియాల్టీ షోలో సెల‌బ్రెటీలుగా యాంక‌ర్ల‌ని ఎక్కువ‌గా తీసుకుంటుంటారు. సుమ‌, అన‌సూయ‌, ఉద‌య‌భాను లాంటి పేర్లు ఈ ద‌ఫా గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ముందుగానే ఈ షో ఆఫ‌ర్ త‌న వ‌ర‌కూ రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో... ఇలా స్పందించి ఉంటుంది ఝాన్సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS