కోర్టు కి హాజరైన యాంకర్ రవి

మరిన్ని వార్తలు

ప్రముఖ యాంకర్ రవి ఈరోజు ఉదయం కోర్టుకి హజరయ్యాడు.

వివరాల్లోకి వెళితే, గత సంవత్సరంలో నాగ చైతన్య నటించిన రారండోయి వేడుక చూద్దాం చిత్రానికి సంబందించిన ఆడియో విడుదల కార్యక్రమంలో నటుడు చలపతిరావు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడిన సంఘటనలో భాగంగా యాంకర్ రవి కోర్టుకి హాజరయ్యాడు.
ఆరోజు చలపతిరావు పైన నమోదు అయిన కేసులో రవిని కూడా చేర్చడంతో ఆయన ఈరోజు ఆ కేసు విచారణకి నాంపల్లి లోని కోర్టుకి వచ్చాడు. తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 9కి ఈ కేసు వాయిదా వేశారు.

ఇదిలావుండగా విచారణ అనంతరం బయటకి వచ్చినయాంకర్ రవిని మీడియా చుట్టుముట్టగా నేను మీకు మసాలా ఇవ్వదలుచుకోవడం లేదు. ఏం జరిగిందో అదే రాయండి, ఇంకేమైనా ఉంటే తానే చెబుతాను అంటూ సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.

ఇది యాంకర్ రవి కోర్టు సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS