తెలుగులో 'తడాఖా' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఆండ్రియా చాలా కాలం తర్వాత మళ్లీ 'గృహం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే 'తడాఖా'లో సునీల్ భార్యగా చాలా హోమ్లీ క్యారెక్టర్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ, తాజా చిత్రం 'గృహం'లో మాత్రం బోల్డ్‌గా నటించేసింది. సిద్దూతో రొమాన్స్ విషయంలో ఎక్కడా మొహమాటపడలేదు. ఇదో హారర్ చిత్రం. సో శృంగార సన్నివేశాలు శృతి మించే ఉన్నాయి. సిద్దార్ద్, ఆండ్రియా మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో పండించారు తెర మీద. హాలీవుడ్ రేంజ్ సినిమా అనిపించేందుకు ఓ పక్క భయపెడుతూనే, మరో పక్క రొమాన్స్ చితక బాదేశారు. ఆండ్రియా అందాల విందుకు తెలుగు ప్రేక్షకులు శాంతం ఫిదా అయిపోయారు.
ఇక చాక్లెట్ బోయ్‌లా, లవర్ బోయ్‌లా ఉండే సిద్దూ పాత్ర ఈ సినిమాలో సరికొత్తగా ఉంది. అసలు ఈ క్యారెక్టర్ చేసింది సిద్దూయేనా అని ఆశ్చర్యపోయేంతగా తన పాత్రలో ఒదిగిపోయాడు సిద్దార్ద్. గతంలో తెలుగులో చాలా సార్లు అవకాశాలొచ్చినా, అప్పుడు తమిళంలో తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ముద్దుగుమ్మ ఆండ్రియా ఆ అవకాశాల్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడలా కాదు, ఇకపై తెలుగు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్ని వదులకోనంటోంది. అంతేకాదు త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చేసుకుంటానంటోందీ బ్యూటీ. ఈ బ్యూటీ కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. సో ఈ మల్టీ టాలెంటెడ్ అయిన బ్యూటీపై మన దర్శక నిర్మాతలు దృష్టి పెడతారో లేదో చూడాలి. పర్‌ఫామెన్స్ సూపర్. ఎక్స్‌పోజింగ్‌కి నో లిమిట్స్. అన్నింటికీ మించి మల్టీ టాలెంటెడ్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న ముద్దుగుమ్మ టాలీవుడ్‌కీ అవసరమే. ఏమో చూడాలి మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో!