ఈ టైటిల్ చూసి మహేష్ సినిమాలో ‘హీరోయిన్’ పైన పాట ఏదో పెట్టారు అని అనుకోకండి.
వివరాల్లోకి వెళితే, తమిళ నటి, నేపధ్యగాయని అయిన ఆండ్రియా సూపర్ స్టార్ మహేష్ కోసం ఒక పాట పాడారు. మహేష్-కొరటాల శివ కలయికలో వస్తున్న భరత్ అను నేను చిత్రానికి ఆమె పాత పాడారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియచేస్తూ, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మంచి ట్యూన్ కి తాను గాత్రాన్ని అందించాను.
ఇక ఇదిలావుండగా, కమల్ హసన్ విశ్వరూపం 2 చిత్రంలో కూడా ఆమె ఒక పాట పాడుతుండడం గమనార్హం. ఆమె అటు నటిగా (ఈ మధ్యనే విడుదల అయిన గృహం చిత్రంలో ముఖ్యపాత్ర) చేస్తూనే పాటలు కూడా పాడడం అభినందించదగ్గ విషయం.
మరి ఈ భరత్ అను నేను ఆల్బం లో ఎటువంటి పాట పాడిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..