ముద్దుగుమ్మ ఆండ్రియా తమిళంలో మంచి నటి. తెలుగులో 'తడాఖా' సినిమాతో స్ట్రెయిట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సునీల్‌కి జోడీగా నటించింది ఆ సినిమాలో. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిందట. ఈ ముద్దుగుమ్మ వయసు 34. అయితే ఇదివరకటి రోజుల్లో 30 ఏళ్లకు దగ్గర్లోనే హీరోయిన్స్‌కి రిటైర్మెంట్ వచ్చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
నలభై రీచ్ అయినా కానీ హీరోయిన్స్ కెరీర్‌కి ఏమాత్రం ఢోకా ఉండడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో కొనసాగుతున్న శ్రియ, అనుష్క, నయనతార, త్రిష తదితర హీరోయిన్లు తమ తమ కెరీర్స్‌ని ఇంకా బిల్డప్ చేసుకుంటున్నారు. వరుస అవకాశాలతో దూస్కెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్స్ కొరత ఎలాగూ ఉంది. సో ఈ ముద్దుగుమ్మ ఆశ నెరవేరుద్దేమో. ఆండ్రియా మంచి నటి మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. పాటలు పాడుతుంది. సొంతంగా కంపోజ్ చేసిన మ్యూజిక్‌తో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ కొన్ని కొన్ని మెలకువల్లో ఆరితేరింది ఈ బ్యూటీ.
సో ఇలాంటి మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాకీ అవసరమే. ఒకవేళ అమ్మడి ఫోకస్ ఫలిస్తే తెలుగులో అవకాశాలకేం కొదవుండదు. ప్రస్తుతం 'గృహం' సినిమాలో నటిస్తోంది. సిద్ధార్ద్ హీరోగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత ముద్దుగుమ్మ ఆండ్రియా తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలిక.