పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన 'రోగ్' సినిమాతో తెరంగేట్రం చేసిన క్యూట్ భామ ఏంజెలీనా గుర్తుంది కదా. క్యూట్‌నెస్‌తో పాటు, విచ్చలవిడి హాట్‌నెస్‌తోనూ కెవ్వుకేక పుట్టించింది 'రోగ్' సినిమాలో ఈ భామ. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది. త్వరలోనే ఓ సినిమాతో ఏంజెలీనా ఎంటర్ ది డ్రాగన్ అంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రోళ్లను మత్తెక్కించేయడానికి సిద్ధమవుతోందట.
జనానికి తాను ఎంత గుర్తున్నానో చెక్ చేసేందుకు శాంపిల్‌గా ఓ పిక్‌ని పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. నేవీ బ్లూలో కలర్‌ఫుల్ బికినీ ఫోటో అది. ఇంకేముంది ఆ పిక్‌కి లైకులు, షేర్లు కొట్టేందుకు నెటిజన్లు పోటెత్తారు. సో ఏంజెలీనాకి ఫాలోయింగ్ బాగానే ఉందన్న మాట. ఆమె రీ ఎంట్రీకి ఈ రకంగా వెల్‌కమ్ చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం హాట్ బ్యూటీకి గ్రాండ్ వెల్‌కమ్.