రాజశేఖర్‌కి రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరవాత అది ఇంకాస్త ఎక్కువైంది. అప్పట్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరవాత... కొంతకాలానికి టీడీపీలో చేరారు. ఆ తరవాత జగన్ గూటికి వచ్చారు. 'జగన్ సభల్లో మాకొస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నాడు..' అంటూ సంచలన కామెంట్లు చేసి జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
ఇప్పుడు మళ్లీ జగన్ పార్టీలోనే చేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో జగన్‌ని కలుసుకున్న రాజశేఖర్.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికలలో జగన్ పార్టీ విజయానికి కృషి చేస్తానని మీడియాతో చెప్పారు. జగన్‌తో పాటు ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోబోతున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి వైకాపాకి సినీ గ్లామర్ బాగానే యాడ్ అవుతుంది. హాస్యనటులు, రచయితలు, దర్శకులు, ఇప్పుడు మాజీ హీరోలు కూడా ఆ పార్టీ కండువా వేసుకుంటున్నారు. మరి అవి ఏ మేరకు ఓట్లు తీసుకొస్తాయో చూడాలి.