యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజశేఖర్ పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నాడు. 'అర్జున' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ రాజశేఖర్ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. అవును లాంగ్ గ్యాప్ తర్వాత 'గరుడవేగ' సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన రాజశేఖర్, ఆ సినిమా తర్వాత నటిస్తున్నది యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కల్కి' సినిమాలోనే.. ఈ సంగతే ఫ్యాన్స్‌కి తెలిసింది.
అలాంటిది ఎలాంటి అప్డేట్ లేకుండా, సడెన్‌గా 'అర్జున' సినిమా తెరపైకి రావడం, అది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నిజంగానే అంతా షాకయ్యారు. కన్మని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. త్వరలో ఎలక్షన్స్ ఉండడంతో, పొలిటికల్ హీట్ ఉన్న ఈ తరుణంలో రాజశేఖర్ వంటి సీనియర్ హీరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలుండడం సహజమే.
మార్చి 15న 'అర్జున' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాజశేఖర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఏజ్డ్ క్యారెక్టర్ మరొకటి యంగ్ క్యారెక్టర్. చూడాలి మరి రాజశేఖర్ డబుల్ ధమాకా ఎలా ఉండబోతోందో.