అనిల్‌ ఫోకస్‌ అటు కాదు ఇటు మళ్లింది.!

మరిన్ని వార్తలు

'ఎఫ్‌ 2' బ్లాక్‌ బస్టర్‌తో ఒక్కసారిగా అనిల్‌ రావిపూడి ఇమేజే మారిపోయింది. స్టార్‌ డైరెక్టర్స్‌ లిస్టులోకి చేరిపోయాడు అనిల్‌ రావిపూడి. ఆ జోష్‌లోనే సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో సినిమాకి కమిట్‌ అయ్యాడు. 'మహర్షి' సినిమా తర్వాత మహేష్‌బాబు చేస్తున్న సినిమా అనిల్‌ రావిపూడితోనేనన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ దాదాపు ఓకే అయినట్లే. సో అనిల్‌ ప్రస్తుతం ఈ సినిమాకి కథను సిద్ధం చేయడం కోసం కసరత్తులు చేస్తున్నాడట. 

 

అయితే 'ఎఫ్‌ 2' హిట్‌తో ఆ వెంటనే 'ఎఫ్‌ 2' సీక్వెల్‌ కూడా తెరకెక్కించేస్తాననీ, అది కూడా అతి త్వరలోనే పట్టాలెక్కిస్తాననీ చెప్పిన అనిల్‌, ఇప్పుడు ఆ విషయం పూర్తిగా పక్కన పెట్టేసి, మహేష్‌ సినిమా పైనే ఫోకస్‌ పెట్టాడట. ఏప్రిల్‌లో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే అనిల్‌తో సినిమా పట్టాలెక్కనుందట. ఇదిలా ఉంటే, ఈ మధ్య మహేష్‌బాబు హుందా అయిన పాత్రలే పోషిస్తున్నాడు. కానీ అనిల్‌ రావిపూడి కోసం మహేష్‌ గెటప్‌తో సహా బాడీ లాంగ్వేజ్‌ కూడా మారిపోనుందట. 

 

'దూకుడు', 'ఖలేజా' తరహాలో ఫుల్‌ జోష్‌ఫుల్‌ క్యారెక్టర్‌లోకి మహేష్‌బాబును మార్చేయబోతున్నాడట అనిల్‌ రావిపూడి. ఇదంతా బాగానే ఉంది. కానీ అనిల్‌ రావిపూడి, మహేష్‌బాబుతో సినిమా విషయంలో ఇంకా సరైన క్లారిటీకి రాలేదనీ, తనకు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన 'ఎఫ్‌ 2' సీక్వెల్‌ పైనే అనిల్‌ ఫోకస్‌ ఉందనీ ఫిలిం వర్గాల్లో టాక్‌ రన్‌ అవుతోంది. ఇంతకీ అనిల్‌ ఏం చేస్తున్నాడో, ఏ సినిమాకి ఓటేశాడో తెలియాలంటే లెట్స్‌ వెయిట్‌ అండీ సీ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS