పెళ్లయితే హీరోయిన్స్‌కి అవకాశాలు రావు అనే మాటకి చెక్ పెట్టేసింది అక్కినేని కోడలు సమంత. కానీ పెళ్లి కాకుండానే కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడిపోయింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్‌కి. స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి, సమంత, కాజల్ వరుసలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ ప్రీత్‌సింగ్‌కి తెలుగులో తీరని అన్యాయం జరుగుతోంది. సమంత, కాజల్, తమన్నా వంటి తోటి ముద్దుగుమ్మలు వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తుంటే, రకుల్‌కేమో వచ్చాయనుకున్న అవకాశాలే చేజారిపోతున్నాయి.
ఎలాగోలా'ఎన్టీఆర్' బయోపిక్‌లో చోటు దక్కించుకున్న రకుల్ క్యారెక్టర్‌కి వీసమెత్తైనా గుర్తింపు దక్కలేదు. ఇక వెంకీ - చైతూ మల్టీ స్టారర్ 'వెంకీ మామ'లోనైనా ఆఫర్ దక్కిందిలే అనుకుంటే ఆ ఛాన్స్ కూడా మిస్సయ్యిందట రకుల్‌కి. అలాగే భారీ బడ్జెట్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి రకుల్‌ని హీరోయిన్ అనుకున్నారు. అయితే ఆ ఛాన్స్ కూడా గద్దలా తన్నుకెళ్లిపోయిందట మరో ముద్దుగుమ్మ. 'వెంకీ మామ'లో రకుల్ ఛాన్స్ ఎత్తుకెళ్లింది నభా నటేష్ అయితే, బెల్లంకొండతో ఛాన్స్‌ని రాశీఖన్నా తన్నుకెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.
అవకాశాలు రాకపోతే రాకపోయాయ్ కానీ, ఇలా చేతికొచ్చాయనుకున్న అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అవుతుండడం నిజంగా రకుల్‌కి అవమానమే. ఇదిలా ఉంటే రకుల్ తమిళంలో హవా చూపిస్తోందనుకుంటే పొరపాటే, అక్కడా రకుల్‌కి చుక్కెదురైంది. 'ఖాకీ'తో మంచి హిట్ కొట్టిన కార్తి - రకుల్ కాంబో ఈ సారి మాత్రం బోల్తా కొట్టింది. 'దేవ్' తీవ్రంగా నిరాశపరిచింది. చూడాలి మరి రకుల్ పరిస్థితి ఏంటో. ఇక బాలీవుడ్‌లోనైనా ఈసారి రకుల్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలిక.