మ‌హేష్ బాబుకి 36 ల‌క్ష‌ల ఫైన్‌!

మరిన్ని వార్తలు

ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ మ‌న మ‌హేష్‌బాబుదే అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌భుత్వానికి 35 ల‌క్ష‌ల జ‌రిమానా చెల్లించింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం సినిమా టికెట్ల‌పై జీఎస్‌టీని త‌గ్గించింది. కానీ ఏఎంబీ సినిమాస్‌లో మాత్రం త‌గ్గిన ధ‌ర‌ల్ని అమ‌లు చేయ‌డం లేదు. జనవరి 1 నుంచి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా గత పన్నురేట్లతోనే టికెట్లు విక్ర‌యిస్తున్నారు.

 

దాంతో కేంద్ర జీఎస్టీ అధికారులు ఏఎంబీపై దాడులు చేసి కేసులునమోదు చేశారు. జనవరి 1 నుంచి ఈనెల 5 వరకు పన్నుమొత్తం రూ.35.66 లక్షలు లెక్క తేలింది. ఈ ప‌న్నుని చెల్లించ‌వ‌ల‌సిందిగా అధికారులు ఆదేశించారు. వెంట‌నే యాజమాన్యం ఆ మొత్తాన్ని చెల్లించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయనున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS