రాజోలు అమ్మాయి అంజలిని తమిళ సినీ జనాలు పట్టించుకున్నంతగా... తెలుగువాళ్లు పట్టించుకోలదన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. అంజలికి తమిళంలోనే మంచి పాత్రలు దక్కాయని, ఇక్కడి ప్రతిభని మనవాళ్లు తక్కువ చేశారని చెప్పుకుంటారు. అంజలి కెరీర్ చూసినా అదే అనిపిస్తుంది. అయితే అంజలి మాత్రం.. `నాకెప్పుడూ తెలుగులో అవకాశాల కొరత లేదు` అనే చెబుతోంది.
``నేను ఎప్పుడూ రేసులోనే ఉన్నా. నాకు ఎవరితోనూ పోటీ లేదు. పక్క వాళ్ల ఎదుగుదల చూసి నేనెప్పుడూ ఈర్ష్య పడలేదు. నా శైలికి తగిన పాత్రలు నన్నే వెదుక్కుంటూ వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు ఆడాయి. కొన్ని ఆడలేదు. అంతే తేడా`` అని పాజిటీవ్ మైండ్ తో మాట్లాడుతోంది. త్వరలోనే తను ఓ పెద్ద హీరో సినిమాలో నటిస్తున్నానని అంటోంది కాజల్. అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు. అయితే వకీల్ సాబ్ హిట్ లో తనకూ భాగం దక్కింది కాబట్టి, ఇక నుంచి అంజలికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి.