అంజలి ఇలా ఎందుకు చేస్తోంది చెప్మా.!

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయి అంజలికి తెలుగులో అవకాశాలు పెద్దగా లేకపోయినా, తమిళంలో మాత్రం బిజీగా గడిపేస్తోంది. అయితే ఈ మధ్య తమిళంలో కూడా అంజలికి పెద్దగా సక్సెస్‌లు లేవనే చెప్పాలి. కీర్తిసురేష్‌ తదితర కొత్త ముద్దుగుమ్మలు తెలుగుతో పాటు తమిళంలో కూడా సత్తా చాటుతుండడంతో, అంజలి వంటి సీనియర్‌ భామలకు కాస్త జోరు తగ్గిందక్కడ. అయితే అంజలి ఇప్పుడు మళ్లీ ఇదివరకటి జోరు ప్రదర్శిస్తోందనీ సమాచారమ్‌. 

సీనియర్‌ నటుడు ముమ్ముట్టి సరసన అంజలి ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే విజయ్‌ ఆంటోనీతో 'కాళీ' చిత్రంలోనూ అంజలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి కాక మరో రెండు ప్రాజెక్టులు అంజలి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టైంలో అంజలి బరువు తగ్గే ప్రయత్నం చేస్తోందంటూ, నెట్‌లో కొన్ని వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అసలింతకీ అంజలికి బరువు తగ్గాల్సినంత అవసరం ఏమొచ్చింది. ఆమె జత కట్టే హీరోలు యంగ్‌ హీరోలేమీ కాదు కదా. సీనియర్‌ హీరోల పక్కన ఆ మాత్రం బొద్దుతనం ఉండాలి కదా అనుకుంటున్నారు అభిమానులు.

 

అయితే అంజలి మాత్రం తెగ కష్టపడి జిమ్‌లో కసరత్తులు చేసేస్తోందట. అంటే ఇప్పుడున్న సినిమాలతో పాటు, అంజలి యంగ్‌ జనరేషన్‌ హీరోల సరసన ఏమైనా ఛాన్స్‌ కొట్టేసిందా? ఏంటి? అంటూ అనుమానాలు వస్తున్నాయి. మరో పక్క సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రంలో కూడా అంజలి పేరు పరిశీలనలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అంజలి కసరత్తులు ఏ సినిమా కోసమో, ఏ హీరో కోసమో, ఆమె పెదవి విప్పితే గానీ తెలీదు సుమీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS