నిధి కన్నా నభానే 'ఇస్మార్ట్‌' అట.!

మరిన్ని వార్తలు

ఒకేసారి అక్కినేని హీరోలు అఖిల్‌, చైతూలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేసినా ఏ ఒక్కరూ ఈ ముద్దుగుమ్మకి హిట్‌ ఇవ్వలేకపోయారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది. అవును అక్షరాలా నిధి అగర్వాల్‌ కోసమే. ఇప్పుడీ ముద్దుగుమ్మ 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాగోలా ఈ సినిమాతోనైనా నెట్టుకొచ్చేద్దామా అనుకున్న తరుణంలో ఫస్ట్‌ హీరోయిన్‌గా నిధి పేరు ప్రకటిస్తూనే, ఆ వెంటనే మరో భామ నభా నటేష్‌ పేరు తెరపైకి తీసుకొచ్చింది 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీమ్‌. 

 

దాంతో పాప బాగా ఫీలయ్యిందట. ఏం చేస్తుంది. దొరికినదాంతోనే సరిపెట్టుకుందామంటే, ఇప్పుడు మరోసారి చుక్కెదురైంది పాపం నిధి అగర్వాల్‌కి. ఈ సినిమాలో నభా నటేష్‌ క్యారెక్టర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుందట. నిధి అగర్వాల్‌ క్యారెక్టర్‌ జస్ట్‌ గ్లామర్‌ కోసమే వాడబోతున్నాడట పూరీ జగన్నాధ్‌. పర్‌ఫామెన్స్‌ బేస్‌ అంతా నభా నటేష్‌ క్యారెక్టర్‌కే రాసేశాడట. దాంతో నిధి పర్‌ఫామెన్స్‌కి అంతగా స్కోపు లేకుండా పోతుందని టాక్‌ వినిపిస్తోంది. 

 

ఆల్రెడీ 'నన్ను దోచుకుందువటే' సినిమాలో 'సిరి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌' అంటూ నభా నటేష్‌ చేసిన అల్లరి, సందడి అంతా ఇంతా కాదు, ఆ అల్లరితోనే ఆడియన్స్‌ని పడగొట్టేసింది. సో మరోసారి తన పర్‌ఫామెన్స్‌తో నభా కట్టిపాడేయనుందని తెలుస్తోంది. అయితే నభా నటేష్‌ పాత్రతో పోల్చితే నిధి అగర్వాల్‌ పాత్రకి నిడివి చాలా ఎక్కువట. అది చాలదు నిధి అగర్వాల్‌ పంట పండటానికి. అయినా ఏం చెప్పగలంలెండి, అర నిముషం తెరపై కనబడి, సినిమా మొత్తం ఆ ఇంపాక్ట్‌ని వదిలి వెళితే.! ఏది ఏమైనా 'ఇస్మార్ట్‌ శంకర్‌' నిధి అగర్వాల్‌ని తెగ టెన్షన్‌ పెట్టేస్తోందనుకోవాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS