ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో నటిస్తోంది. 'మజ్ను' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది కాలంలోనే ఏకంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించేసే ఛాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఏం మ్యాజిక్ ఉందో ఈ మలయాళ బ్యూటీలో ఆ ఛాన్స్‌ని ఇంత త్వరగా దక్కించేసుకుంది. అదేంటంటే, అది తన అదృష్టమంటోంది. పవన్‌తో నటించడం చాలా కొత్త అనుభూతినిస్తోందంటోంది. ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటోంది. మామూలుగానే పవన్ కళ్యాణ్‌తో నటించిన ముద్దుగుమ్మలు ఈ విషయాన్ని కామన్‌గా చెబుతూ ఉంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం మరింత ఎక్జైట్‌మెంట్ ఫీలవుతూ చెబుతోంది. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, పవన్ మేనరిజమ్.. ఇలా ఒక్కటేమిటీ, అన్నీ సూవర్బ్ అంటోంది. అందుకే పవన్‌కి ఇంతమంది అభిమానులున్నారంటోంది. పవన్‌తో ఒక్క ఫోటో దిగినా చాలనుకుంటారు చాలా మంది. అలాంటి వారిలో తాను ఒకదాన్ననీ అంటోంది. అలాంటిది ఆయనతో కలిసి ఓ సినిమా కోసం ఇన్ని రోజులు ట్రావెల్ చేసే అవకాశం దక్కినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంటోంది. అలాగే ఈ అవకాశాన్నిచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్‌నీ ఆకాశానికెత్తేస్తోంది ముద్దగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. అందమే కాదండోయ్ ఈ ముద్దుగుమ్మకి మాటల్తో బుట్టలో పడేయడం కూడా వెన్నతో పెట్టిన విద్యేలా ఉంది. అయితే పవన్ సినిమాలో ఛాన్స్ అనగానే ఏదో చెల్లెలి పాత్రో, గెస్ట్ పాత్రో అనుకుందట మొదట్లో ఈ ముద్దుగుమ్మ. కానీ అది వన్ ఆఫ్ ది హీరోయిన్ అంటే ఎగిరి గంతేసిందట. అందుకే ఇంత ఎగ్జైట్‌మెంట్ అంటోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ ముద్దుగుమ్మ పొగడ్తలతో తడిసి ముద్దయిపోతున్నారన్న మాట. ఇవి కాక గోపీచంద్‌తో 'ఆక్సిజన్' సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. మరో పక్క ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.