పచ్చబొట్టూ..చెరిగీపోదులే!

మరిన్ని వార్తలు

'పచ్చబొట్టూ చెరిగిపోదులే.. పడుచు గుండె చెదిరిపోదులే.. ' అని అప్పుడెప్పుడో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ 'దసరా బుల్లోడు' సినిమాలో పాటేస్కున్నారు. వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఆ పాట చిత్రీకరించారు డైరెక్టర్‌ ఆ సినిమాలో. ఈ పాట మాత్రం వెరీ వెరీ పాపులర్‌.. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీనూ. అయితే అసలు ఈ పాట హిస్టరీ ఎందుకు బయటికి వచ్చిందంటారా? ఉంది మరి. కొన్నాళ్ల క్రితం ముద్దుగుమ్మ నయనతార, ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ ఓ సెన్సేషన్‌. ప్రేమ ముదిరి పెళ్లి పీటలెక్కే సమయానికి బ్రేకప్‌ వచ్చేసింది ఈ ఇద్దరి మధ్యా. తృణ ప్రాయంగా ఇద్దరూ వారి లవ్‌ స్టోరీకి సెండాఫ్‌ ఇచ్చేశారు. అయితే ప్రేమ ముదిరి పాకాన ఉన్న టైంలో కొన్ని ప్రేమ గుర్తులు మాత్రం చెరిగిపోనీయకుండా పదిలపరచుకున్నారు. ఆ ప్రేమ చిహ్నమే పచ్చబొట్టు. నయనతార చేతిపై 'పి.డి' అనే పచ్చబొట్టు ఉంది. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న టైంలో ఈ పచ్చబొట్టు వేయించుకుంది. అప్పుడే చెప్పింది నయన్‌ ఈ పచ్చబొట్టును ఎప్పటికీ తీయననీ, ప్రభుదేవాపై ప్రేమకు గుర్తుగా ఎప్పటికీ తన చేతిపై ఉంచుకుంటాననీ.. తాజాగా ఆమె చేతిపై ఈ పచ్చబొట్టు తారసపడింది. శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది ప్రస్తుతం నయనతార. ఆ సినిమా సాంగ్‌ షూటింగ్‌లో దిగిన ఫోటోలో ఈ పచ్చబొట్టు కెమెరాకి చిక్కింది. దాంతో ప్రభుదేవా, నయన్‌ల ప్రేమ వ్యవహారం తలంపుకొచ్చింది. అయితే ఇదంతా ప్రస్తుతం గతం. తాజాగా ఓ తమిళ డైరెక్టర్‌తో ప్రస్తుతం మళ్లీ ప్రేమలో ఉంది ఒకపక్క నయన్‌. మరో పక్క తమిళ, తెలుగు సినిమాలతోనూ బిజీ అయిపోయింది. అలాగే ప్రభుదేవా బాలీవుడ్‌ సినిమాల డైరెక్షన్‌లో బిజీగా ఉన్నాడు. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS