షాక్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌.!

By iQlikMovies - August 21, 2018 - 14:22 PM IST

మరిన్ని వార్తలు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో సినిమా అనగానే వచ్చిన క్రేజ్‌ అంతా, రిలీజయ్యాక ఆ సినిమాతో వెంటాడుతున్న దురదృష్టం అంతా ఇంతా కాదు ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి. 

'అజ్ఞాతవాసి'లో అనూ నటిస్తోందన్న ఇన్‌ఫర్మేషన్‌ అందగానే, సో లక్కీ అంటూ అనూని ఆకాశానికెత్తేయడం, సినిమా రిజల్ట్‌ వచ్చాక అన్‌ లక్కీ అంటూ పాతాళానికి నెట్టేయడం చాలా తక్కువ టైంలో జరిగిపోయాయి. అయితే ఎలాగోలా చేతిలో ఉన్న సినిమాలతోనే నెట్టుకుంటూ, ఉన్న సినిమా పైనే ఆశలు పుంజుకుంటూ వస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్‌కి వరుస ఫెయిల్యూర్స్‌ ఇరకాటంలో పడేస్తున్నాయి. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం పైనే అన్న సంగతి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. అయితే ఈ ఆశలపై కూడా నీలి మేఘాలు ముసురుకున్నాయి. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం వాయిదా పడింది. కేరళ వరదల కారణంగా ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం కావస్తున్నాయట. అందుకే సినిమాని పోస్ట్‌ పోన్‌ చేస్తున్నామంటూ చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

ఈ విషయాన్ని చైతూ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ఈ రకంగా అనూకి షాక్‌ తగులుతుందని పాపం అనూనే ఊహించి ఉండదు కాబోలు. మరింతకీ 'శైలజారెడ్డి అల్లుడు' ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చేనో, శైలజారెడ్డి కూతురుగా అనూ ఇమ్మాన్యుయేల్‌ తన ఈగోని ఎప్పుడు శాటిస్‌ఫై చేసుకునేనో నిదానంగా తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS