చిరంజీవి సినిమాల్ని బట్టలు చింపుకుని చూసిన ఓ సాదా సీదా వ్యక్తి ఇప్పుడు ఆ చిరంజీవితోనే సినిమా డైరెక్ట్ చేయడమంటే అది అదృష్టమనాలా? లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనాలా? ఆ అరుదైన అవకాశమే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి దక్కింది. సురేందర్ రెడ్డికి దక్కిన అదృష్టం అలాంటిలాంటిది కాదు. ఒక్క మెగాస్టార్ కాదు, ఇద్దరు మెగాస్టార్స్‌ని ఎట్ ఏ టైమ్ డీల్ చేసే అదృష్టం ఆయన్ని వరించింది 'సైరా నరసింహారెడ్డి' సినిమా ద్వారా.
ఇకపోతే ఈ సినిమాని బాధ్యతతో కాదు, భక్తితో చేశాడట సురేందర్‌రెడ్డి. మొదట్లో ఈ సినిమాని టేకప్ చేయాలంటే చాలా భయపడ్డాడట. తాను డీల్ చేయగలనా? అని. అయితే చిరంజీవిని సెట్స్‌లో తొలిసారి చూడగానే అర్ధమైపోయిందట. ఆయన ముందు ఇంకెవ్వరైనా జీరో అని. ఓ డైరెక్టర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన తాను నేర్చుకున్నది నత్తింగ్. నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చిరంజీవిని చూస్తే అర్ధమైందట.
డూప్స్ లేకుండా, ఆ వయసులో ఆయన చేస్తున్న పోరాట సన్నివేశాలు, యూనిట్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించాయంటున్నాడు సురేందర్‌రెడ్డి. ఇంతవరకూ చిరంజీవికి సురేందర్‌రెడ్డి అభిమాని మాత్రమే. కానీ ఇప్పుడు భక్తుడైపోయాడు. ఎంతో భక్తితో చేసిన సినిమానే 'సైరా నరసింహారెడ్డి'. కథ విన్నాక దాదాపు సంవత్సరం పాటు ఈ కథపై రీసెర్చ్ చేశాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుండి మోర్ ఇన్‌ఫర్మేషన్ గేదర్ చేసి స్క్రీన్‌ప్లే ప్రిపేర్ చేశాడు.
అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు అంత టైం తీసుకుంది.