తెలుగులో హీరోయిన్‌గా స్టార్‌డమ్ వస్తే, ఆ తర్వాత ఎటువైపు వెళ్లినా ఆదరణ దక్కుతుంది. కొన్ని కొన్నిసార్లు తెలుగులో ఆఫర్స్ రాకపోయినా, ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవచ్చు. అయితే మలయాళ కుట్టి అనూ ఇమ్మాన్యుయేల్ పరిస్థితి మాత్రం తారుమారుగా ఉంది.
ఈ బ్యూటీ తెలుగులో గంపెడు ఆశలతో అడుగుపెట్టింది. ఆశలు నెరవేరే టైమే. కానీ చిన్న టైమ్ బ్యాడ్. టోటల్ కెరీర్‌నే తికమక చేసేసింది. అంతవరకూ తెలుగులో రకుల్ ప్రీత్‌సింగ్, కాజల్, తమన్నా తదితర బ్యూటీల హవా కొనసాగుతున్న తరుణంలో హఠాత్తుగా ఈ బ్యూటీ లైన్‌లోకి రావడం, వరుస పెట్టి ఆఫర్లు సంపాదించడం, చిన్న చిన్న ఆఫర్లు కాస్తా, స్టార్ హీరోల రేంజ్‌కి ఎదగడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇవన్నీ మాటల దగ్గరే ఆగిపోయాయి. 'అజ్ఞాతవాసి' ఆఫర్ రావడంతో ఈ బ్యూటీని మిగిలిన స్టార్ హీరోలు కూడా హోల్డ్‌లో పెట్టారు. అయితే 'అజ్ఞాతవాసి' రిజల్ట్ వచ్చాక, నిర్మొహమాటంగా రిజక్ట్ చేసేశారు. అంతవరకూ అనూ ఇమ్మాన్యుయేలే మొదటి ఆప్షన్‌గా ఉన్న ఆ ప్లేస్‌ని అనూహ్యంగా పూజా హెగ్దే తన్నుకెళ్లిపోయింది.
పోనీలే 'అజ్ఞాతవాసి' నిరాశపరిచినా, 'సూర్య' అయినా అనూని ఆదుకుంటాడేమో అనుకుంటే, అదీ జరగలేదు. దాంతో ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ వైపు దృష్టి పెట్టిందని తెలుస్తోంది. తెలుగులో తనకింక సీను లేదని గ్రహించింది కాబోలు. ఇక్కడ దుకాణం సర్దేసి, తమిళంలో అదృష్టం పరీక్షించుకోబోతోందని తాజా సమాచారమ్. తెలుగులో చుక్కెదురైన చాలా మంది ముద్దుగుమ్మలకు తమిళ పరిశ్రమ ఆశ్రయమిచ్చి ఆదరించింది. అలాగే అనూకి కూడా కోలీవుడ్ కలిసొస్తుందేమో చూడాలిక.