'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. 'శతమానం భవతి' వంటి సూపర్ హిట్స్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. టాలెంటెడ్ గాళ్. అండ్ వెరీ కామ్ గాళ్. అలాంటి అనుపమపై కొన్ని రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. అనుపమ ప్రేమలో పడిందా.? అది కూడా ఓ క్రికెటర్ లవ్‌లో.. అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ఉంది చూశారూ.. ఇదే అన్ని రూమర్స్‌కి ఆధ్యం పోసేది. అసలు అగ్గి పుట్టేదే అక్కడ. ఆధ్యం పోసేది కూడా అక్కడే అనుకోండి. అలా క్యూట్ గాళ్ అనుపమకూ, యంగ్ క్రికెటర్ బూమ్రాకు మధ్య లింకులు కలిపేసింది సోషల్ మీడియా. అవునులెండి, ఇక్కడ నో సీక్రెట్స్ మరి. ఎవరెవరు ఏం చేస్తున్నారనేది ఇక్కడ తెలిసిపోతుంది.
డైరెక్ట్‌గా కాకున్నా, అంతరార్ధాల్ని అంచనా వేసేస్తుంటారిక్కడ. అలా ఏదో క్యాజువల్‌గా వీరిద్దరూ తమ తమ పోస్ట్‌లను లైక్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం చేస్తున్నారంతే. కలిసి తిరగలేదు, కెమెరా కంటా పడలేదు. కానీ, ఆ మాత్రానికే వీరిద్దరి మధ్యా ఏదో ఉందని పుకార్లు షికారు చేసేస్తున్నాయి. ఎందుకొచ్చిన గొడవలే విషయం పెద్దది చేయడమెందుకా అని అనుకుందో ఏమో మొదట్లోనే అనుపమ ఈ వార్తల్ని ఖండించేసింది. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బూమ్రా తనకు ఓ మంచి స్నేహితుడు మాత్రమే అని పేర్కొంది. అయితే, మన క్రికెటర్ బూమ్రా ఉన్నాడు చూశారూ.. ఎందరో క్రేజీ భామలుండగా, సోషల్ మీడియాలో ఆయన ఫాలో అవుతున్నది ఒక్క అనుపమనే మరి. సో ఇది చాలదా.. వీరి మధ్య ఏదో కెమిస్ట్రీ, ఫిజిక్సులు నడుస్తున్నాయనడానికి. ఇంకొక్క మాట.. ప్రేమకు పునాది కూడా స్నేహమే కదా. సో అలా ఆ తర్వాత వీరి మధ్య స్నేహం కాస్త ముదిరి పాకాన పడి ప్రేమగా మారితే.. ఏమో ఆ ప్రేమ కబురు త్వరలో కానీ తెలుస్తుందా.? లేక వీరిద్దరి పరిచయం స్నేహం దగ్గరే జస్ట్ క్యాజువల్‌గా ఆగిపోతుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.