'ప్రేమమ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే హిట్ టాక్‌తో పాటు టాలెంటెడ్ అని కూడా ప్రూవ్ చేసుకుందీ బ్యూటీ. అంతేకాదు, లక్కీ బ్యూటీ అనిపించుకుంది కూడా.
'శతమానం భవతి' సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ రామ్‌తో నటించిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాతో నిరాశ పరిచింది. అయినా కానీ టాలెంట్‌కి సక్సెస్‌తో సంబంధం లేదంటోందీ భామ. వరుస పెట్టి సినిమాలు చేసేయ్యాలని అనుకోవడం లేదట అనుపమా. కానీ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌నే ఎంచుకోవాలనుకుంటోందట. తాజాగా ఈ బ్యూటీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథలకు పెట్టింది పేరైన కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్‌తో పాటు చాలా అందంగా ఉంటారు. అయితే అందంలో అనుపమాకి లోటేం లేదు కానీ, గ్లామర్ విషయానికి వస్తే, కాస్త ఆలోచించాల్సిందే. అయితే తాజా సమాచారమ్ ప్రకారం ఈ అందాల భామ ఈ సినిమా కోసం గ్లామర్ అంచుల్ని కాస్త తొలిగించనుందనీ తెలుస్తోంది. మరీ గ్లామరస్‌గా కాకుండా, అలా అనీ మరీ ట్రెడిషనల్‌గా కాకుండా, క్యూట్ గ్లామర్ ప్రదర్శించాలని అనుకుంటోందట. అవును మరి గ్లామర్ విషయంలో మరీ అనుపమలా హద్దులు పెట్టుకుంటే, రేసులో వెనకబడిపోవడమే.
మరో పక్క మిగతా హీరోయిన్లు గ్లామర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన 'ఇంటెలిజెంట్' సినిమాలో లావణ్య త్రిపాఠి పిచ్చ హాట్‌గా కనిపించి, కుర్రకారు గుండెల్లో కెవ్వు కేక పెట్టించేసింది. అయితే అన్ లక్కీగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోవడం అమ్మడికి కలిసి రాలేదంతే!