త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'అ,ఆ..' సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. వస్తూ వస్తూనే అమ్మడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మంచి హిట్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 'శతమానం భవతి' సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇంతవరకూ అనుపమ ట్రెడిషనల్ లుక్‌లో అందంగా క్యూట్‌గా కనిపించింది. అంతేకానీ ఎక్కడా ఓవర్ డోస్ గ్లామరస్ అప్పీల్ ఇవ్వలేదు. తొలిసారిగా అల్ట్రా మోడ్రన్ గెటప్‌లో కనిపించబోతోందట ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. అది కూడా నాని హీరోగా తెరకెక్కబోయే సినిమా కోసమని సమాచారమ్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ఈ సినిమాకి 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్ ఖరారు చేశారు. నాని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలియవస్తోంది. ఇప్పటిదాకా అనుపమ సంప్రదాయ బద్ధమైన పాత్రల్లోనే కనిపించింది. 'శతమానంభవతి' సినిమాలో విదేశాల నుంచి వచ్చిన అమ్మాయే అయినా, ఆమె గెటప్ సంప్రదాయబద్ధంగానే కన్పిస్తుంది. నాని సినిమా కోసం మాత్రం అల్ట్రా మోడ్రన్‌గా మారనుందట ఈ బ్యూటీ. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో అనుపమ అంద చందాలు ఇంకెంత క్యూట్‌గా ఉంటాయో చూడాలిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో నటిస్తోంది.