'ప్రేమమ్' సినిమాతో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తెలుగు తెరకు పరిచయమైంది. వస్తూ వస్తూనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత వచ్చిన 'శతమానం భవతి' సినిమా కూడా అనుపమాకి మంచి పేరు తీసుకొచ్చింది. యంగ్ హీరో రామ్‌తో అనుపమా నటించిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా నిరాశపరిచినా, వెంటనే మెగా కాంపౌండ్ నుండి పిలుపు రావడంతో అమ్మడి పంట పండినట్లే అయ్యింది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంతవరకూ అనుపమా పరమేశ్వరన్ గ్లామర్‌కి దూరంగా ఉంది. ట్రెడిషనల్ లుక్‌లో, ట్రెండీ అమ్మాయి పాత్రల్లోనే కనిపించింది. అయితే కరుణాకరన్ సినిమాలో అనుపమా కాస్త గ్లామర్ అప్పీల్ ఇవ్వనుందనీ తెలుస్తోంది. అలా అని ఎక్కువ ఎక్స్‌పోజింగ్ జోలికి పోదట. గ్లామర్ వేరు. ఎక్స్‌పోజింగ్ వేరు అనే పాయింట్‌ని నోటీస్ చేయాలిక్కడ. పైన కనిపిస్తోన్న ఫోటోలో అనుపమా పరమేశ్వరన్‌ని చూశారుగా చాలా అందంగా ఉంది కదా.
అలాగే గ్లామర్ అప్పీల్ కూడా కొంచెం చూపిస్తుందట. హద్దులు మాత్రం మీరనంటోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథకి ఆ మాత్రం గ్లామర్ అవసరమట. అందుకే ఈ సారి అలా కనిపించక తప్పడం లేదు అని అనుపమా చెబుతోంది. ఇంతవరకూ అనుపమా క్యూట్ అప్పీల్‌నే చూసిన ఆమె అభిమానులు, 'తేజ్ ఐ లవ్ యూ'లో ఈ బ్యూటీ గ్లామర్ అప్పీల్ ఎలా ఉండబోతోందోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.