'భాగమతి' నెక్ట్స్‌ సినిమా ఎవరితోనో తెలుసా.!

మరిన్ని వార్తలు

'ఖైదీ నెం 150' సినిమాతో తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి బ్లాక్‌ బస్టర్‌ వద్ద తన స్టామినాకి ఏమాత్రం ఢోకా లేదని నిరూపించాడు. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, రికార్స్‌ ఆర్‌ బ్యాక్‌ అనిపించాడు. ఇక ప్రస్తుతం 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీలో ముచ్చటగా మూడో సినిమాకీ లైన్‌ క్లియర్‌ చేసేసిన సంగతి తెలిసిందే. 

చిరంజీవి ఓకే అనాలే కానీ, వరుస పెట్టి డైరెక్టర్లు కథలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో ముచ్చటగా మూడో ఛాన్స్‌ దక్కించుకున్న డైరెక్టర్‌ కొరటాల శివ. ఈ మధ్య 'భరత్‌ అనే నేను' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన కొరటాల శివ, చిరు కోసం ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో క్లారిటీ రానుంది. అది చిరంజీవి పుట్టినరోజుకే కావచ్చు కూడా. ఇకపోతే 152వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరుతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోయే హీరోయిన్‌ ఎవరనే విషయంపై ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. 

150వ చిత్రం కోసం మొట్టమొదటిగా పరిశీలనకొచ్చిన పేరు ఈ ముద్దుగుమ్మదే. అయితే అప్పటికి ఆమె డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో అది కుదరలేదు. ఆ బంపర్‌ ఆఫర్‌ని కాజల్‌ తన్నుకుపోయింది. ఇక తాజా చిత్రం 'సైరా' కోసం నయనతారను తీసుకున్నారు. ఇప్పుడు కొరటాల శివ మూవీ కోసం ఆ ముద్దుగుమ్మని మళ్లీ పరిశీలిస్తున్నారట. ఇంతకీ ఆమె ఎవరనేదే కదా మీ క్యూరియాసిటీ. ఎవరో కాదు, దేవసేన అనుష్క. 

'బాహుబలి', భాగమతి' చిత్రాలతో వరుస హిట్లు కొట్టి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ముద్దుగుమ్మ అనుష్క. గతంలో 'స్టాలిన్‌' సినిమాలో అనుష్క, చిరుతో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషించనుందని సమాచారమ్‌. 'భాగమతి' తర్వాత స్వీటీ మరే కొత్త ప్రాజెక్ట్‌కీ సైన్‌ చేయలేదు. ఈ తాజా ప్రచారంలో కూడా అఫీషియల్‌ క్లారిటీ లేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS