అందంతో పాటు అభినయం కూడా తోడైన నటి అనుష్క. బాహుబలి చిత్రం తరువాత తను చేస్తున్న చిత్రం భాగమతి, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలై మంచి ఆదరణ పొందింది.
ఇక ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదలకి సిద్ధం అవుతుండగా, భాగమతి చిత్రాన్ని అదే సమయంలో తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ డబ్బింగ్ రైట్స్ ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సుమారు రూ 15 కోట్లు వెచ్చించి దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు.
ఒక వేళ ఇదే గనుక నిజమైతే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఇంతమోత్తంలో చెల్లించడం రికార్డు గా చూడొచ్చు. దీనికి కారణం నటి అనుష్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
రిలీజ్ కి ముందే ఇంతటి బిజినెస్ సాదించిన భాగమతి రేపు విడుదల అయ్యాక ఎటువంటి సంచలనాలు నమోదు చేయనున్నదో చూడాలి.