హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ అంటే ప్రస్తుతం తెలుగులో ఠక్కున గుర్తొచ్చే పేరు అనుష్క. 'భాగమతి' సినిమాతో హిట్ కొట్టిన అనుష్క తదుపరి పెళ్లి చేసుకోబోతోందంటూ, ఇక సినిమాల్లో నటించదంటూ గాసిప్స్ వచ్చాయి. అయితే ప్రతీసారి పెళ్లి మాటను దాటేస్తూ వచ్చిన అనుష్క ఈ సారి కూడా అలాగే ఎస్కేప్ అయిపోయింది.
పెళ్లి సంగతి సరే కానీ, అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందనుందట. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుందట ఈ సినిమా. కోన వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారనీ తెలుస్తోంది. 'భాగమతి'లా ఇది కూడా థ్రిల్లర్ మూవీనేనట. ఇదంతా బాగానే ఉంది. కానీ కొత్త సినిమాకి సైన్ చేసిందంటే, అనుష్క ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు మరి.
ఇదిలా ఉంచితే, తాజా సినిమా విషయానికి వచ్చేద్దాం. ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడనీ సమాచారమ్. ఆల్రెడీ మాధవన్ తెలుగులో 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నాడు. అంటే మాధవన్ తెలుగులో వరుస సినిమాలను షురూ చేశాడనే అర్ధమవుతోంది. ఎప్పటి నుండో తెలుగులో సినిమాలు చేయాలని భావించినా, అది కుదరలేదు. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ వరుస సినిమాల్లో నటించి మెప్పించేందుకు రెడీ అవుతున్నాడన్న మాట మాధవన్.
ఇకపోతే 'సవ్యసాచి'లో మాధవన్‌ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. అయితే జేజమ్మ సినిమాలో మాత్రం ఆయన ఓ పవర్‌ఫుల్ ఆఫీసర్ తరహా పాత్ర పోషిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి.