జై, రష్మీ గౌతమ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'అంతకుమించి'. లేటెస్టుగా ధియేటర్స్‌లో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వివాదం తెరపైకి వచ్చింది. గౌరీ శంకర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సినిమాని స్టార్ట్ చేసింది ఈయనే. అయితే కొంత సినిమా పూర్తయ్యాక ఇక ఖర్చుపెట్టడం తన వల్ల కాదనీ, ఈ సినిమా తీయలేననీ మధ్యలోనే చేతులెత్తేశాడు ఈ ప్రొడ్యూసర్. దాంతో హీరో జై ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తానని నిర్మాణ బాధ్యతల్ని తన భుజానకెత్తుకున్నాడు. ఎలాగోలా సినిమాని పూర్తి చేశాడు.
అయితే మొదటి ప్రొడ్యూసర్ గౌరీ శంకర్‌కి సినిమా విడుదలయ్యాక, అంతకుముందు ఆయన సినిమా కోసం ఖర్చుపెట్టిన అమౌంట్ 50 లక్షలు తిరిగిస్తానని మాటిచ్చాడట. కానీ సినిమా రిలీజయ్యాక సింపుల్‌గా హ్యాండిచ్చాడట హీరో కమ్ నిర్మాత జై. దాంతో సదరు ప్రొడ్యూసర్ గౌరీ శంకర్ కోర్టునాశ్రయించాడు. మరి హీరో జై ఏం చేస్తాడో, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలిక.
ఇకపోతే రష్మీ పోస్టర్స్‌పై హాట్ హాట్‌గా కనిపించి యూత్‌ని పిచ్చ పిచ్చగా ఎట్రాక్ట్ చేసేసింది. వీడికి పగలు అమ్మాయిల డ్యూటీ. రాత్రి దెయ్యాల డ్యూటీ అనే డైలాగ్‌తో ప్రమోషన్స్ హోరెత్తించేశారు. ఈ సినిమాలో గ్లామర్‌తో పాటు, రష్మీ యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా నటించింది. టోటల్‌గా సినిమా సక్సెసా? ఫెయిల్యూరా? అనే మాట పక్కన పెడితే, రష్మీ కెరీర్‌లోనే పర్‌ఫామెన్స్ ప్లస్ ఫుల్ డోస్ గ్లామర్ మూవీ 'అంతకుమించి' అని చెప్పక తప్పదు.