అనుష్క మరోసారి ప్రయోగం చేస్తోందా.?

By iQlikMovies - December 29, 2018 - 17:43 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ హీరోయిన్స్‌లో ప్రయోగాల క్వీన్‌ అంటే అనుష్క అనే చెప్పాలి. జేజమ్మగా 'అరుంధతి'తో మెప్పించింది. 'బాహుబలి'లో దేవసేనగా డీ గ్లామర్‌ ఏజ్డ్‌ రోల్‌ పోషించింది. 'సైజ్‌జీరో' అంటూ ఊబకాయం ఉన్న యువతిగా నటించి, కెరీర్‌కే పెద్ద సాహసం చేసింది. ఇక ఇప్పుడు ఇంకో ప్రయోగానికి అనుష్క సై అన్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' తర్వాత స్వీటీ బ్యూటీ 'భాగమతి' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అనుష్క కొత్త సినిమా వివరాలు వెల్లడి కాలేదు.

 

ఈ మధ్యనే తమిళ హీరో మాధవన్‌తో 'సైలెన్స్‌' మూవీలో నటిస్తోందని వార్త వచ్చింది. హేమంత్‌ మధుకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క చెవుడు, మూగ లోపాలున్న యువతిగా కనిపించబోతోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. చెవిటి కుర్రాడి పాత్రలో రామ్‌చరణ్‌ నటించిన 'రంగస్థలం' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది.

 

గతంలో నయనతార ఓ సినిమాలో వినికిడి లోపంతో కనిపించింది. ఆ పాత్ర నయనతారకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా అనుష్క వినికిడి లోపంతో పాటు, అంధురాలిగా కూడా నటించి పెద్ద సాహసానికే శ్రీకారం చుట్టబోతోందని సమాచారమ్‌. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుందట.ఈ సినిమా కోసం అనుష్క బాగా సన్నబడిందని తెలుస్తోంది. చూడాలి మరి, అనుష్క తాజా ప్రయోగం సక్సెస్‌ అయ్యేనో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS