జేజమ్మ ఎక్కడుందో తెలుసా.?

మరిన్ని వార్తలు

'భాగమతి' సినిమా తర్వాత అనుష్క ఎక్కడా కనిపించలేదు. అయితే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత అనుష్క 'సైలెన్స్‌' అనే మూవీకి సైన్‌ చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సన్నబడడానికి అనుష్క కసరత్తులు మొదలుపెట్టిన సంగతి కూడా ముచ్చటించుకున్నాం. అయితే లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారమ్‌ ప్రకారం అనుష్క బాగా సన్నబడిందని తెలుస్తోంది. మునుపటిలా సన్నజాజి నడుముతో స్లిమ్‌గా అందంగా మారిపోయిందట అనుష్క.

 

ఈ సినిమాలో మాధవన్‌ మెయిన్‌ లీడ్‌ పోషిస్తుండగా, అనుష్క హీరోయిన్‌గా ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ సినిమా త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుంది. అమెరికాలోని సియాటెల్‌లో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. అనుష్కతో పాటు చిత్ర యూనిట్‌ అంతా అమెరికాకు లగేజ్‌ ప్యాక్‌ చేసుకుందట. ఎక్కువ భాగం అక్కడే ఈ సినిమా షూటింగ్‌ జరగనుందనీ తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి సర్‌ప్రైజింగ్‌ ట్విస్ట్‌ ఏదో ఉందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటో సినిమా చూసే వరకూ తెలియదా.? లేక మధ్యలోనే చిత్ర యూనిట్‌ హింట్‌ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కోన ఫిలిం కార్పోరేషన్‌, పీపుల్స్‌ మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS