యూఎస్‌లో 'సైలెన్స్‌'గా స్వీటీ రొమాన్స్‌.!

By Inkmantra - December 17, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

జేజమ్మ అనుష్క - రొమాంటిక్‌ హీరో మాధవన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైలెన్స్‌'. ఈ సినిమా జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ థ్రిల్లర్‌ మూవీ నుండి లేటెస్ట్‌గా ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ప్రోమోని రిలీజ్‌ చేశారు. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్‌కి భాస్కర్‌ భట్ల లిరిక్స్‌ అందించారు. 'నిన్నే నిన్నే..' అంటూ సాగే ఈ సాంగ్‌ని సిడ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. వీడియో సాంగ్‌ ప్రోమో కాబట్టి విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

 

ఈ సినిమాలో చాలా భాగం అమెరికాలోనే చిత్రీకరించారు. స్వీటీ అనుష్క, మాధవన్‌ మధ్య చిన్న చిన్న రొమాంటిక్‌ సీన్స్‌ని అమెరికాలోని అందమైన లొకేషన్స్‌లో ఆహ్లాదంగా ఉండేలా ఈ పాట చిత్రీకరణ జరిగింది. మెలోడి వాయిస్‌లో సాగే ఈ పాటకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుష్క మ్యూట్‌ ఆర్టిస్ట్‌ సాక్షి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిషియన్‌ పాత్రలో మాధవన్‌ కనిపించనున్నాడు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS