స్వీటీ బ్యూటీ అనుష్క అంటే ఫిట్‌నెస్‌తో పాటు, క్యూట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. అయితే 'సైజ్‌జీరో' తర్వాత అనుష్క బొద్దుగా కాస్త ఎబ్బెట్టుగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎంత ప్రయత్నించినా పాపం అనుష్క ఆ బరువు బాధ్యతల నుండి అంత తేలిగ్గా బయట పడలేకపోయింది. తాజాగా అనుష్క స్లిమ్ లుక్స్‌తో వార్తల్లో హాట్‌టాపిక్ అయ్యింది. స్లిమ్ లుక్‌లో అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొన్ని ఫోటోల్లో అనుష్క పక్కనున్న వ్యక్తి ఎవరు అనే అంశంపై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఆ వ్యక్తి పేరు ల్యూక్ కోటిన్‌హో. ప్రముఖ న్యూట్రీషనిస్ట్. ఫిట్‌నెస్ స్పెషలిస్ట్ కూడా. ఈయన సూచించిన డైట్ కారణంగానే అనుష్క మునుపటిలా స్లిమ్‌గా తయారైంది. అయితే అనుష్క ఫిట్‌నెస్ వెనక పెద్ద కథే ఉంది. మామూలుగా ఎక్సర్‌సైజులు చేస్తే ఫేస్‌లో క్యూట్‌నెస్, ఫ్రెష్‌నెస్ పోతుంది. అందుకే అనుష్క, ల్యూక్ కలిసి ఈ సరికొత్త ఫిట్‌నెస్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రాంని చేపట్టారు. ఇష్టమైన ఫుడ్‌ని తీసుకుంటూనే శరీరాన్ని ఆరోగ్యంగా, స్లిమ్‌గా ఉంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఇదే అనుష్క పాఠించింది. అయితే దీన్ని కేవలం అనుష్క తనతో పాటే ఆగిపోకుండా, అందరిలోనూ ఈ ఫిట్‌నెస్ సూత్రం పట్ల అవగాహన పెంచాలనుకుంది. ఇందుకోసం స్పెషల్‌గా ఓ డైట్ ప్రోగ్రాంని ప్రిపేర్ చేసిందట ల్యూక్‌తో కలిసి అనుష్క. బిజినెస్‌లా కాకుండా, ఓ సేవా కార్యక్రమంలా దీన్ని చేపట్టాలని అనుకుంటున్నారట. అదీ సంగతి. అంతేకానీ ఫోటోల్ని చూసి, అనుష్కకీ, ల్యూక్‌కి అఫైర్ కట్టబెట్టేశారు నెటిజన్లు. ల్యూక్‌కి ఆల్రెడీ పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు.