జగపతి బెస్ట్‌ ఎవర్‌ లుక్‌'.!

మరిన్ని వార్తలు

జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా 'సైరా'లో ఆయన పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది 'సైరా' టీమ్‌. పాత్ర విషయానికి వస్తే, జగపతిబాబు 'వీరారెడ్డి' పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్‌లుక్‌ చాలా చాలా బావుంది. జగపతిబాబు ఇంతవరకూ చేసిన అన్ని లుక్స్‌లో ది బెస్ట్‌ లుక్‌ ఇదే అని అంతా మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఈ లుక్‌ చాలా బాగుంది. 

 

పొడుగాటి జుట్టు, తెల్లని గుబురు గెడ్డం, మెలి తిరగిన మీసాలు, నుదుటన బొట్టు, తలపాగాతో ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తున్నాడు జగపతిబాబు. రొమాంటిక్‌ హీరోగా జగపతిబాబుని పలు చిత్రాల్లో చూసేశాం. ఇక ఈ జనరేషన్‌కి విలన్‌గా కరడు కట్టిన విలన్‌గానూ చూసేశాం. ఇక సైరా సినిమాకి సంబంధించి జగపతిబాబుది అత్యంత కీలకమైన పాత్ర. రిలీజైన లుక్‌ని బట్టి చూస్తే ఈ సినిమాలో జగపతిబాబు నెక్స్ట్‌ లెవల్‌ పర్‌ఫామెన్స్‌ని ఈ సినిమాలో చూడబోతున్నామని తెలుస్తోంది. 

 

ఆల్రెడీ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ చూసేశాం. సుదీప్‌, విజయ్‌సేతుపతి, తమన్నా, నయనతార ఇలా పలువురు కీలక పాత్రల లుక్స్‌ పరిచయం చేసేశారు. ఇవన్నీ కాక అతి త్వరలోనే 'సైరా'కి సంబంధించి బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్‌ రానుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న చిత్రమిది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS