అనుష్కను తీసుకొస్తున్న 'సైరా' టీమ్‌!

మరిన్ని వార్తలు

జేజమ్మ అనుష్కను 'సైరా'లో కీలక పాత్ర కోసం తీసుకున్నారంటూ గత కొద్ది రోజులగా టాక్‌ సర్క్యులేట్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్కను ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం తీసుకున్నారనీ, లేదు.. లేదు కథని నెరేట్‌ చేసేది అనుష్కే అనీ, అనుష్కతోనే 'సైరా' కథ మొదలవుతుందనీ.. ఇలా రకరకాల గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి. అయితే, అనుష్క 'సైరా'లో నటించడం నిజమేనని తాజాగా అందుతోన్న సమాచారమ్‌.

 

అయితే అనుష్క పాత్రేంటీ.? అనే దానిపై పూర్తిగా క్లారిటీ లేదు. కానీ, అనుష్క 'సైరా'లో ఖచ్చితంగా కనిపించబోతోందనీ కన్‌ఫామ్‌ అయ్యింది. 'సైరా'లో తన పాత్రపై అనుష్క త్వరలోనే స్పందించే ఆలోచనలో ఉందనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. ఇప్పటికే 'సైరా'లో బాలీవుడ్‌ నుండి, కోలీవుడ్‌ నుండీ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌తో పాటు, కన్నడ నటుడు సుదీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

మెగా డాటర్‌ నిహారిక, ప్రస్తుతం అనుష్క.. ఇలా 'సైరా'కి సరికొత్త వన్నెలు దిద్దబోతున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి షెడ్యూల్‌ షూటింగ్‌లో ఉండగా, ఇటీవల సైరా సెట్‌ అగ్నిప్రమాదానికి గురి కావడంతో కొంత షూటింగ్‌కి బ్రేక్‌ పడినా, వీలైనంత త్వరలోనే ఆ బ్రేక్‌ని ఫుల్‌ఫిల్‌ చేసేయనున్నారట సైరా టీమ్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS