భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి అందాల తార అనుష్క శర్మల మధ్య ఉన్న ప్రేమ విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇంకొక రెండు మూడు రోజుల్లో వీరి వివాహం ఇటలీ లో జరగనుంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మీడియా దృష్టంతా వారి పైనే ఉంది. దీనికి తోడుగా వరుస క్రికెట్ మ్యాచ్ లతో అలిసిపోయిన తనకి విశ్రాంతి ఇవ్వాలంటూ క్రికెట్ బోర్డుని సెలవు కోరి ఇప్పుడు విరామం తీసుకున్నాడు.
ఇప్పుడు విరామం తీసుకున్నది అనుష్క తో పెళ్ళి కోసమే అని వార్తలు మొదలయ్యాయి. నిన్ననే అనుష్క తన కుటుంబసభ్యులు వారి ఇంటి పురోహితుడితో ఇటలీ వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారంతా వెళ్ళింది పెళ్ళి కొరకే అన్నది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట.
మొత్తానికి అనుష్క-విరాట్ ల పెళ్ళి ఒక వార్త నుండి పెద్ద స్థాయి చర్చ దశకి చేరుకుంది.