సైరా పై క్లారిటీ ఇచ్చిన రెహ్మాన్

మరిన్ని వార్తలు

సైరా నరసింహా రెడ్డి చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటే సదరు యూనిట్ మెంబర్స్ ఒక్కోకరుగా సినిమా నుండి వైదోలుగుతున్నారు.

మొన్ననే కెమెరామెన్ రవివర్మన్ బయటకి తెలియని కారణాల వల్ల ఈ చిత్రం నుండి బయటకి వెళ్ళిపోగా తాజాగా సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఈరోజు హైదరాబాద్ లో ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ నైట్ ఉండడంతో ఆయన ఇక్కడ ప్రెస్ తో ముచ్చటించడం జరిగింది.

ఇక ఆ సందర్భంలోనే ఏఆర్ రెహ్మాన్ తాను చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం చేయడం లేదు అని ప్రకటించాడు. తన బిజీ షెడ్యూల్ కారణంగానే చేయలేకపోతున్నట్టు చెప్పాడు. అంతేతప్ప వేరే కారణాలు ఏమి లేవని స్పష్టంచేశాడు.

ఈ చిత్రం లేట్ అవుతున్న కొద్ది  ఏవో ఒక అవాంతరాలు ఏర్పడుతునే ఉన్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS