ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 'మగధీర'తో స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్ 'నాయక్', తర్వాత 'గోవిందుడు అందరివాడేలే' వరకూ కొనసాగింది. ఇలా మూడు సినిమాల్లో కాజల్, చరణ్‌తో జత కట్టింది. అన్నట్లు 'ఎవడు' సినిమాలోనూ కాజల్ గెస్ట్ రోల్లో నటించింది. ఆ రకంగా కాజల్‌కి చరణ్‌తో త్రీ ప్లస్ వన్ అచి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ వేలో ఉన్నది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే చరణ్‌తో 'బ్రూస్లీ', ధృవ' సినిమాల్లో నటించింది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ముచ్చటగా మూడో సారి రకుల్, చరణ్‌తో జత కట్టనుందని తెలియవస్తోంది.
బోయపాటి శీను - చరణ్ కాంబినేషన్లో కొత్త సినిమా రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్‌ని అనుకుంటున్నారట. బోయపాటి శీనుతో రకుల్ ఇటీవలే 'జయ జానకీ నాయకా' సినిమాలో నటించింది. సో చరణ్ సినిమాలో హీరోయిన్గా బోయపాటి ఆప్షన్ రకుల్‌కే ఉండొచ్చంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఒకవేళ అదే జరిగితే రకుల్, చరణ్‌తో మూడోసార జత కడుతున్నట్లే. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ, రెండోది కార్తితోనూ. కాగా తెలుగులో కూడా ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయనీ సమాచారమ్. అయితే వాటిలో చరణ్ సినిమా ఒకటి కావచ్చు.
యాక్టింగ్ పరంగా రకుల్ చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. అందుకే రకుల్ అంటే అందరికీ ఇష్టం. అన్నట్లు రకుల్ నటించిన 'జయ జానకి నాయకా' చిత్రం ఈ ఆదివారం బుల్లితెరపై ప్రసారం కానుంది. రకుల్ - బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా వచ్చిన ఈ సినిమా విజయవంతమైన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబట్టింది.