శంకర్ ని ఒత్తిడి గురించి ప్రశ్న వేసిన జక్కన్న

మరిన్ని వార్తలు

నిన్న 2.0 ట్రైలర్ లాంచ్ చెన్నైలోని సత్యం సినిమాస్ లో అట్టహాసంగా జరిగింది. ఇక ఈ లాంచ్ లో దర్శకుడు శంకర్ ని మరో ప్రముఖ దర్శకడు రాజమౌళి ఒక ఆసక్తికరమైన ప్రశ్నని ఆయన పై సంధించాడు.

ఇంతకి ఆ ప్రశ్న ఏంటంటే- మీరు ఇంతటి పెద్ద చిత్రాన్ని తీస్తున్న సమయంలో, అదేవిధంగా రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఉన్న అశేష అభిమాన ఘనాన్ని సంతృప్తిపరిచే సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురయ్యారు అని ప్రశ్నించాడు.

దీనికి శంకర్ స్పందిస్తూ- ఒత్తిడిని జయించడానికి నేను పాటించే సూత్రం- బాగా కష్టపడి పనిచేయడం. మనకి నచ్చిన పనిచేస్తుంటే ఒత్తిడికి ఆస్కారం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

చివరగా తాను రాజమౌళి అతిపెద్ద ఫ్యాన్ అంటూ ముగించాడు దర్శకుడు శంకర్.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS