ఆ తెలుగమ్మాయికి 'వజ్రకవచం' కలిసొస్తుందా?

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయి అర్చన అలియాస్‌ వేద చాలా కాలం తర్వాత ఓ సినిమాలో కనిపించబోతోంది. అదే 'వజ్రకవచ ధర గోవిందా'. సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో అర్చన కీలక పాత్ర పోషిస్తోంది. రాజకీయ నాయకురాలిగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'వజ్ర కవచ ధర గోవిందా' చిత్రం ట్రైలర్‌లో అర్చన అప్పియరెన్స్‌ గురించి తెలిసింది. గతంలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన అర్చన, తర్వాత కొన్ని క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా పోషించింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

 

తర్వాత కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లోనూ మెరిసింది. 'బిగ్‌బాస్‌' రియాల్టీ షోలో కనిపించి, బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 'బిగ్‌బాస్‌' తర్వాత అయినా అర్చనకు మంచి అవకాశాలు వస్తాయని ఆశించారంతా. కానీ అదీ జరగలేదు. రేస్‌లో అర్చన కనిపించకుండా పోయింది. చాలా కాలం తర్వాత ఇదిగో సప్తగిరి సినిమాలో కనిపించింది. ట్రైలర్‌లో అర్చన క్యారెక్టర్‌ వివరాలేమీ తెలియరాలేదు. కానీ సినిమాకి ఆ క్యారెక్టర్‌ ప్రాధాన్యత ఇవ్వదగ్గదే అనిపిస్తోంది. ఒకవేళ సినిమా హిట్‌ అయితే, అర్చనకి కలిసొచ్చే అంశమే అవుతుంది.

 

అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వైభవ్‌ జోషి హీరోయిన్‌గా నటిస్తోంది. 'జబర్దస్త్‌' గ్యాంగ్‌లో చాలా మంది తమదైన శైలి కామెడీతో ఆకట్టుకోబోతున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది 'వజ్ర కవచ ధర గోవిందా'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS