విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్‌రెడ్డి' సినిమా గురించి దేశమంతా చర్చించుకుంటోంది. తెలుగు రాకపోయినా, సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాని ఇప్పటికే దేశమంతా చూసేసింది. తమిళ ప్రేక్షకులకి ఈ సినిమా రీమేక్ త్వరలో కనువిందు చేయనున్న సంగతి తెలిసినదే. ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తనయుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు. అతనికి హీరోగా తొలి సినిమా ఇదే.
ఇంకో వైపున మలయాళ, కన్నడ సినీ పరిశ్రమల్లోనూ 'అర్జున్‌రెడ్డి' రీమేక్ గురించిన చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌లో 'అర్జున్‌రెడ్డి' రీమేక్ కానుందనీ ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తాడనీ గుసగుసలు వినవస్తున్నాయ్. అయితే ఇంకా ఈ అంశానికి సంబంధించి కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. తెలుగులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'అర్జున్‌రెడ్డి' రూపొంది, ఘనవిజయం సాధించింది. ఘనవిజయం కాదది, అంతకు మించిన సంచలన విజయమే సాధించింది 'అర్జున్‌రెడ్డి'. వివాదాలకు బెదరలేదు, యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడంతో 'అర్జున్‌రెడ్డి' బాక్సాఫీస్ వద్ద కనకవర్షమే కురిపించిందని చెప్పవచ్చు.
2017లో వచ్చిన సినిమాలన్నిటిలోకీ లాభాల పరంగా 'టాప్ 5'లో 'అర్జున్‌రెడ్డి' సినిమా ఉంటుందనడం నిస్సందేహం. అందుకే ఈ సినిమా రీమేక్ కోసం దాదాపు దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలూ ఆసక్తి చూపుతున్నాయి. నిర్మాతలు, దర్శకుల ఆసక్తి ఓ వైపు, హీరో పాత్ర కోసం ప్రముఖ హీరోలు, వారి వారసుల ఎదురుచూపులు ఇంకో వైపు 'అర్జున్‌రెడ్డి' గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 'అర్జున్‌రెడ్డి' ఓ యంగ్ హీరోని స్టార్‌గా మార్చేసింది. 'అర్జున్‌రెడ్డి' ఓ దర్శకుడ్ని టాప్ స్లాట్‌లోకి పంపింది. 'అర్జున్‌రెడ్డి' ఓ హీరోయిన్‌కి సైతం 'స్టార్‌డమ్' ఇచ్చింది. అందుకే 'అర్జున్‌రెడ్డి' మిగతా చిత్రాలకు చాలా చాలా భిన్నమైన సినిమా.
'అర్జున్‌రెడ్డి' బుల్లితెరపై సందడి చేయడానికీ రెడీ అవుతోంది. వచ్చే ఆదివారం ఈ సినిమా బుల్లితెరపైకి వచ్చేస్తోంది.