హను రాఘవపూడి దర్శత్వంలో తెరకెక్కుతోన్న 'లై' సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. టీజర్ వచ్చాక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. నిజానికి అంత రిచ్‌గా ప్లాన్ చెయ్యలేదట ఈ సినిమాని. కానీ నిర్మాతల సహకారంతో అనుకున్నదానికన్నా రిచ్‌గా తెరకెక్కించే అవకాశం వచ్చిందంటున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. అయితే నిర్మాత ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా అని అనవసరమైన ఖర్చు చేయలేదట. అది డైరెక్టర్ గొప్పతనం. మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించామని చెప్పాడు హను రాఘవపూడి. లొకేషన్స్‌తోనే సినిమాకి ఇంత రిచ్‌నెస్ వచ్చిందట. సెట్స్ వేసే ఖర్చు తగ్గడంతో అది సినిమా రిచ్‌నెస్‌కి ఇంకోలా ఉపయోగపడేలా చేయగలిగామని చెప్పాడు హను రాఘవపూడి. విజువల్‌గా బాగుండేలా, ప్రతీ లొకేషన్‌నీ ప్రేక్షకుడు అనుభూతి పొందేలా తెరకెక్కించారట. ఇది విలన్ యాంగిల్‌లోంచి స్టార్ట్ అయ్యే సినిమా అట. మన తెలుగు సినిమా ఫార్ములాకి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. హీరో జీవితంలోకి విలన్ రావడం పరమ రొటీన్. విలన్ జీవితంలోకే హీరో హీరోయిన్ రావడం కొత్త కాన్సెప్టే కదా. ఆ కొత్తదనమే తన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నాడు హను. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేఘా ఆకాష్ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.