మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సోషల్ మీడియాలో మహేష్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ 'మా తరానికి నువ్వే సూపర్ స్టార్' అని పేర్కొన్నాడు. ఈ రోజు మహేష్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సూపర్‌స్టార్‌కి విషెస్ చెబుతూ, ఈ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. మనోడికి అందరితోనూ స్నేహం ఉంది. ఈ తరం ఆ తరం అనే తేడా లేకుండా అందరితోనూ ఫ్రెండ్‌షిప్ చేసేస్తూ ఉంటాడు తేజు. ఆ మాటకొస్తే ఈ తరం కథానాయకులు ఎవ్వరూ బేషజాలకు పోవడంలేదు. ఒకర్ని ఒకరు అభినందించుకుంటున్నారు, అవసరం వస్తే ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ఆహ్వానించదగ్గ ఆరోగ్యకరమైన వాతావరణం ఇది. ఇంకో వైపున సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరోల దగ్గర్నుంచి, హీరోయిన్లు, ఇతర నటీనటుల తరఫున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దసరా కానుకగా సూపర్ స్టార్ సినిమా 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా టీజర్ విడుదలయ్యింది. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'భయపెట్టడం మాకూ తెలుసు' అంటూ టీజర్‌లో కూల్‌గా మహేష్ చెబుతున్న డైలాగ్‌కి ఊపేస్తోంది. మురుగదాస్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. మెహరీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో.