బాస్ హౌస్‌లో ఇంతవరకూ కామ్ అండ్ క్యూట్ కంటెస్టెంట్‌గా ఆషూ రెడ్డిని చెప్పుకున్నాం. కానీ, ఆమె కూడా సౌండ్ పెంచింది. మొన్న రాహుల్‌తో గొడవకు దిగింది. డ్రాగన్ ఎగ్ టాస్క్ విషయంలో రాహుల్, వితికని ఓ రకంగా, రోహిణిని, తననూ ఇంకో రకంగా డీల్ చేస్తున్నాడంటూ అక్కడే ఆషూ తన స్వరం గట్టిగా వినిపించింది. కానీ, నిజానికి అక్కడ రాహుల్ తప్పేమీ లేదు. లేడీస్ విషయంలో రాహుల్ అగ్రెసివ్‌గా పోలేనని చెప్పేశాడు.
కానీ, ఆషూనే అపార్ధం చేసుకుంది. తాజా ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా అదే రీజన్‌తో రాహుల్‌ని నామినేట్ చేసింది ఆషూ రెడ్డి. ఇక హిమజ విషయంలోనూ ఆషూ సీరియస్ అయ్యింది. ఇక్కడి మాటలూ అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా చెబుతోందంటూ హిమజను బ్లేమ్ చేసింది ఆషూ రెడ్డి. అంతేకాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా, థర్డ్ పర్సన్ గురించి వెనకాల మాట్లాడడం సబబు కాదు అంటూ, హిమజకు ఫ్రీ సజిషన్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. అలా సజెస్ట్ చేయడం హిమజకు నచ్చలేదు.
టాస్క్‌ల్లో సరిగ్గా పార్టిసిసేట్ చేయడం రాదు కానీ, ఫ్రీగా సజిషన్స్ ఇస్తావా.? అన్నట్లుగా ఆమెపై విరుచుకుపడింది. దాంతో వీరిద్దరి మధ్యా కొంచెం సేపు వాదులాట ఏర్పడింది. హౌస్ మేట్స్ కలగజేసుకోవడంతో, కొంత సేపటికి వీరి మధ్య వాదులాట కామ్ అప్ అయ్యింది. అషూ కనిపించినంత క్యూట్ అండ్ కామ్ అయితే కాదు అని.. తాజా ఎపిసోడ్ ద్వారా అర్ధమైంది. గత వారంలాగే ఈ వారం కూడా అషూరెడ్డి హౌస్ నుండి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయ్యింది.