'ఎన్నారై' అవసరాల ఆ కిక్కే వేరప్పా.!

మరిన్ని వార్తలు

'అష్టా చెమ్మా' సినిమాతో కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన అవసరాల శ్రీనివాస్‌ తర్వాత దర్శకుడిగా, హీరోగా తనలోని డిఫరెంట్‌ యాంగిల్స్‌ని ఆడియన్స్‌కి పరిచయం చేసేశాడు. ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే, మరోవైపు హీరోగానూ ప్రయత్నాలు చేస్తుంటాడు. అవకాశం చిక్కినప్పుడల్లా డైరెక్టర్‌ అవతారమెత్తేస్తుంటాడు. తాజాగా అవసరాల శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు అవసరాల. 

 

నాగబాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'నాయనా..! రారా ఇంటికి' అనేది ఈ సినిమా టైటిల్‌. అవసరాల తెరకెక్కిస్తున్నాడంటే ఇదేదో ఖచ్చితంగా డిఫరెంట్‌ మూవీనే అనుకోవాలి. 'ఊహలు గుసగుసలాడే' అంటూ ఓ క్యూట్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత 'జ్యో అచ్చుతానంద' అంటూ ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీకి అన్నదమ్ముల ఎమోషన్స్‌ యాడ్‌ చేసి చక్కగా చిత్రీకరించాడు. 

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమా ఒక్కో రకం ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచింది అవసరాల డైరెక్షన్‌లో. ఇక ఇప్పుడు రాబోతున్న 'ఎన్నారై' కూడా మాస్త్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ అవుతుందని పోస్టర్‌ చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ నెల 20 అనగా రేపు ఉదయం గం.11.30 నిముషాలకు 'ఎన్నారై' సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నామని అవసరాల శ్రీనివాస్‌ తెలిపారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS