గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ 'నక్షత్రం' చూస్తే స్టన్‌ అవ్వాల్సిందే.!

By iQlikMovies - December 19, 2018 - 10:25 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. మెగా పవర్‌స్టార్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని తన అంద చందాలతో మెస్మరైజ్‌ చేయనుంది. ఈ లోగా తనలోని వైల్డ్‌ యాంగిల్స్‌ని ఇదిగో ఇలా ప్రదర్శనకు పెట్టేసి, విడుదలకు ముందే ఫాలోవర్స్‌ని తెగ పెంచేసుకుంటోంది. 

 

చూస్తున్నారుగా మొన్నేమో బికినీ బిగువున గ్లామర్‌ సంకెళ్లతో బంధించేసింది. ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలన్నీ తన గ్లామర్‌లో మెరిపించి, మురిపించేస్తోంది. ఈ ముద్దుగుమ్మలో ఇన్ని వైల్డ్‌ యాంగిల్స్‌ ఉన్నాయా.? వీటిలోంచి సినిమాలో ఎన్ని చూపిస్తుందో అంటూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు గ్లామర్‌ కళా పోషకులు. 

 

చూడాలి మరి ఈ బ్యూటీలోని గ్లామర్‌ జిగేల్స్‌ని ఏ రేంజ్‌లో బయటికి తీసే ప్రయత్నం చేశారో డైరెక్టర్‌ బోయపాటి. సంక్రాంతికి వినయ విధేయ రామునితో కలిసి ఈ హాట్‌ అండ్‌ స్పైసీ నక్షత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS