ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న ప్రముఖ కమెడియన్

By iQlikMovies - May 03, 2018 - 17:22 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ కమెడియన్ రఘుకి అమెరికాలో కారు యాక్సిడెంట్ కి గురయ్యాడు.

ఆ వివరాల్లోకి వెళితే, ఒక ప్రైవేటు ఈవెంట్ కోసం అని ఈమధ్యనే అమెరికా వెళ్ళిన రఘుకి అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వర్జీనీయాకి ఆయన ఒక్కడే కారులో ప్రయాణిస్తుండగా, ఆ కారు వేగం ఎక్కువై అదుపుతప్పి బోల్తాపడింది.

అయితే ఆ కారులో ఎయిర్ బెలూన్స్ ఉండడంతో రఘు చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడే ఉన్న తోటి నటీనటులు ఆయనని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారట.

ప్రస్తుతానికి అయితే ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు అని సమాచారం అందుతుంది. ఏదేమైనా ఆ ప్రమాదం నుండి సురక్షితంగా బయట పడడంతో ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS