బాహుబలి పార్ట్ 1లో సూపర్ హిట్ పాట అయిన ‘మనోహరి’లో నర్తించిన స్కార్లెట్ ఒక చిత్ర షూటింగ్ లో తన సహానటుడి చెంప చెల్లుమనిపించింది.
వివరాల్లోకి వెళితే, హన్సా-ఏక్-సన్యోగ్' చిత్రంలో ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా ఆమె పట్ల సహానటుడు అయిన ఉమాకాంత్ రాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్కార్లెట్ అతన్ని ఒకటి రెండు సార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది.
అదే పనిగా అసభ్యంగా ప్రవర్తించే సరికి ఆమె అతడి చెంప చెల్లుమనిపించింది. ఈ ఊహించని సంఘటన జరిగే సరికి అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వెంటనే ఆ నటుడిని షూటింగ్ సెట్ నుండి పంపించివేశారు.